![]() |
![]() |
.webp)
సోషల్ మీడియా కాన్సెప్ట్ బాగా పెరిగాక హోమ్ టూర్స్ చేయడం ఒక స్పెషల్ అట్రాక్షన్ ఐపోయింది. ఐతే హోమ్ టూర్స్ సరే కానీ మరి బుల్లితెర మీద ప్రసారమయ్యే షోస్ , ఈవెంట్స్ లో చూపించే ఇళ్ళు, సెటప్స్ ఎక్కడ ఉంటాయి..ఎలా ఉంటాయి. షూటింగ్ కి బ్యాక్ స్టేజిలో వీళ్ళు ఎం చేస్తుంటారు అంటూ తెలుసుకోవాలనే ఆత్రుత చాలామందిలో ఉంటుంది. అందుకే దీన్ని టాపిక్ గా తీసుకున్న మల్లెమాల ఇప్పుడు తమ షోస్ హోమ్ టూర్స్ ని చూపిస్తోంది. న్యూ ఇయర్ దావత్ స్పెషల్ లో భాగంగా. ఎలాంటి ఫిల్టర్లు లేకుండా అక్కడ షూటింగ్ జరగక ముందు జరిగే సన్నివేశాలను రా-కామెంట్స్ ని కూడా చూపించింది.
ముందుగా సుమ అడ్డా షో హోమ్ టూర్ చూపించారు. ఇందులో రీతూ చౌదరి, పంచ్ ప్రసాద్, నూకరాజు కూర్చుని జోక్స్ వేసుకున్నారు. " 2025 కి నేను చూపించబోతున్నా" అని రీతూ అనేసరికి " ఏంటిది" అన్నాడు పంచ్ ప్రసాద్. ఇంతలో బ్రహ్మాజీ పక్కనుంచి "నీ వల్ల కాదు" అన్నాడు. "ఎంత పెద్ద ఇంటర్వ్యూయర్స్ , మీడియా కానీ వచ్చినా, కావ్య అంటే నాకు ఇష్టం అని చెప్పేస్తా." అన్నాడు ఆది. తర్వాత జబర్దస్త్ హోమ్ టూర్ చూపించారు. ఇక ఇక్కడ ఫైమా ఒక నిజం చెప్పింది. డైలాగ్ మర్చిపోతూ ఉండకుండా దాన్ని అరచేతి మీద రాసుకుని దాన్ని చూసి చెప్తూ ఉంటుందట. తర్వాత ఢీ జోడి హోమ్ టూర్ చేసారు. ఇలా మొత్తం మల్లెమాల షోస్ హోమ్ టూర్ ని చూపించారు.
![]() |
![]() |